లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆర్థిక ఇబ్బందుల్లో కాంగ్రెస్ పార్టీ
- ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేకపోతోంది
- 55 మంది ఉద్యోగులకు గాను, 20 మంది రాజీనామా
- ఖర్చు తగ్గించుకోమని సూచించిన పార్టీ అధిష్ఠానం
ఇప్పటికే కాంగ్రెస్ సేవాదళ్ నెలసరి బడ్జెట్‌ను రెండున్నర లక్షల నుంచి రెండు లక్షల రూపాయలకు తగ్గించిన ఆ పార్టీ అధిష్ఠానం, ప్రస్తుతం ఎన్‌ఎస్‌యూఐ, మహిళా విభాగాలకు కూడా ఖర్చు తగ్గించుకోమని సూచించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితులన్నీ పార్టీ ఆర్థిక ఇబ్బందులను చెప్పకనే చెబుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.