Sonia Gandhi: వైద్య పరీక్షల కోసం అమెరికాకు సోనియా గాంధీ

షార్ట్స్‌లో చూడండి
గతంలో అమెరికాలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా వైద్య పరీక్షల నిమిత్తం ఆమె అమెరికా వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆమె వైద్య పరీక్షల నిమిత్తం నిన్న అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.  

ఇదిలా ఉండగా, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన అనారోగ్యం చికిత్స నిమిత్తం ఇప్పటికే అమెరికాలో వున్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా చికిత్స నిమిత్తం గత నెలలో అమెరికాకు వెళ్లారు. ఆయనతో పాటు ప్రియాంక కూడా అక్కడే ఉన్నారు.

మరోపక్క, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం వచ్చే వారంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరూ పాల్గొనే అవకాశం లేదని సమాచారం.
Go Back to Shorts
Sonia Gandhi
Rahul Gandhi
Congress
Priyanka

More Telugu News