KPHB: కూకట్ పల్లిలో 25 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. కళామందిర్ రోడ్డులో ఉన్న ఓ గదిలో 25 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. నిర్మానుష్య ప్రాంతంలో నిర్మించిన ఈ గదిలో సెంట్రింగ్ కోసం ఉపయోగించే కర్రలతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Go Back to Shorts
KPHB
Murder

More Telugu News