Pakistan: చివరి ఓవర్లో గట్టెక్కిన పాకిస్థాన్.. ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన ఆఫ్ఘనిస్థాన్

షార్ట్స్‌లో చూడండి
స్వల్ప స్కోర్ల సమరంలో పాకిస్థాన్ జట్టు పసికూన ఆఫ్ఘనిస్థాన్ పై విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. లీడ్స్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో పాక్ జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ ఆపసోపాలు పడింది. అయితే చివరి వరుస బ్యాట్స్ మన్ ఇమాద్ వాసిం (49) వహాబ్ రియాజ్ (15) చలవతో మరో రెండు బంతులు మిగిలుండగా పాక్ గట్టెక్కింది. ఆఫ్ఘనిస్థాన్ చివరివరకు పోరాడినా, అనుభవలేమి ఆ జట్టుకు ప్రతిబంధకంగా మారింది. చివరి ఓవర్లో సమీకరణం 6 బంతుల్లో 6 పరుగులు కాగా, ఆఫ్ఘన్ కెప్టెన్ గుల్బదిన్ నయిబ్ బౌలింగ్ కు దిగి ఫుల్ టాస్ లు విసరడంతో పాక్ పని సులువైంది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 227 పరుగులు చేసింది.
Go Back to Shorts
Pakistan
Afghanistan
World Cup

More Telugu News