Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ను ఆలౌట్ చేయలేకపోయిన పాకిస్థాన్.. స్కోరు 227 పరుగులు

షార్ట్స్‌లో చూడండి
లీడ్స్ లో పాకిస్థాన్ తో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఈ వరల్డ్ కప్ లో భీకర బౌలింగ్ వనరులున్న జట్లలో పాకిస్థాన్ కూడా ఒకటి. ఇతర జట్లకు భిన్నంగా ఆ జట్టు ఎప్పుడూ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగుతుంది. అలాంటి పాక్ కూడా ఆఫ్ఘన్లను ఆలౌట్ చేయలేకపోయింది. నిప్పులు చెరిగే బంతులతో పాక్ పేసర్లు విరుచుకుపడుతున్నా ఆఫ్ఘన్ జట్టు నిబ్బరంగా కాచుకుంది.

అయితే అనుభవలేమి కారణంగా భారీస్కోరు నమోదుచేయలేకపోయినా, ఓవర్లన్నీ ఆడాలన్న పట్టుదల మాత్రం ఆఫ్ఘన్లలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆఫ్ఘనిస్థాన్ జట్టులో మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్ఘాన్, నజీబుల్లా జాద్రాన్ చెరో 42 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది 4, వహాబ్ రియాజ్ 2, ఇమాద్ వాసిం 2 వికెట్లు తీశారు.
Go Back to Shorts
Afghanistan
Pakistan
World Cup

More Telugu News