Pakistan: పాకిస్థాన్ టార్గెట్ 238 రన్స్... నీషామ్ అద్భుత ఇన్నింగ్స్

షార్ట్స్‌లో చూడండి
బర్మింగ్ హామ్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ జిమ్మీ నీషామ్ 97 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. 83 పరుగులకే టాపార్డర్ కుప్పకూలిన స్థితిలో బ్యాటింగ్ కు వచ్చిన నీషామ్, మరో ఆల్ రౌండర్ గ్రాండ్ హోమ్ తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరి జోడీ సమయోచితంగా ఆడడంతో కివీస్ స్కోరు 200 దాటింది. అయితే, నీషామ్ సెంచరీకి మరో మూడు పరుగుల దూరంలో ఉండగా, నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యాయి. గ్రాండ్ హోమ్ 64 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. అఫ్రిది 10 ఓవర్లు విసిరి కేవలం 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అఫ్రిది స్పెల్ లో 3 మెయిడెన్లు ఉండడం విశేషం.
Go Back to Shorts
Pakistan
New Zealand

More Telugu News