హైదరాబాదులో సందడి చేయనున్న 'వెంకీమామ'
- బాబీ నుంచి మల్టీ స్టారర్ గా 'వెంకీమామ'
- ఈ నెల 13వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్
- కథానాయికలుగా రాశీ ఖన్నా - పాయల్
ఈ నెల 13వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగు మొదలుకానుంది. ఇది మేజర్ షెడ్యూల్ అనీ .. ఏకధాటిగా షూటింగు చేస్తారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో చాలాభాగం చిత్రీకరణ పూర్తయినట్టు అవుతుందని అంటున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో చైతూ జోడీగా రాశీ ఖన్నా .. వెంకటేశ్ సరసన పాయల్ నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నారనేది త్వరలోనే ప్రకటించనున్నారు.