యడ్యూరప్ప చెప్పినట్టు జరిగితే నా పదవికి రాజీనామా చేస్తా: సిద్ధరామయ్య
- సర్కార్ కూలిపోవడం ఖాయమన్న యడ్యూరప్పపై ఫైర్
- చెప్పినట్టు జరగకపోతే యడ్డీ రాజీనామా చేస్తారా?
- మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదు
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఐదేళ్లూ పూర్తిగా పరిపాలిస్తుందని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని ఘంటాపథంగా చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తమతోనే ఉన్నారని, ఎవరూ పార్టీని వీడబోరని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని, ఆ అధికారం రాజ్యాంగంలోని ఏ పేజీలో ఉందని ప్రశ్నించారు.