3 లక్షల 77 వేల ఓట్ల మెజారిటీతో గౌతమ్ గంభీర్ ఘన విజయం
- ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన గంభీర్
- తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ
- ఐఎన్‌సీ అభ్యర్థిగా అర్వీందర్ సింగ్ లవ్లీ పోటీ
గంభీర్ తన గురించి అసభ్యకర పదజాలంతో కరపత్రాలను ముద్రించారంటూ అతిశి ఆ కరపత్రాన్ని మీడియా ఎదుట చదువుతూ ఇటీవల కన్నీటి పర్యంతమయ్యారు. తానే ఆ కరపత్రాన్ని ముద్రించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని, లేదంటే మీరు తప్పుకుంటారా? అని గంభీర్ సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిరాడు. ఇక ఈ ఎన్నికల్లో గంభీర్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.