గుండెలపై పాకిస్థాన్ జెండా కప్పుకున్న రాఖీ సావంత్.. విమర్శల వెల్లువ
- ఓ సినిమాలో పాక్ యువతిగా రాఖీ
- కాల్చిపారేస్తానంటూ ఓ నెటిజన్ వార్నింగ్
- పాక్ కు మద్దతిస్తావా? అంటూ మండిపాటు
కొన్ని చోట్ల పాకిస్థాన్ జెండాను ప్రదర్శించడం, మరికొన్నిచోట్ల ఆ జెండాను ఎదపై కప్పుకుని కనిపించడం చూడొచ్చు. అంతేకాదు, పాకిస్థాన్ లో అందరూ చెడ్డవాళ్లు కాదని, ప్రతి దేశంలోనూ మంచి చెడులు ఉంటాయని చెబుతూ పాక్ కు మద్దతుగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పెట్టింది. దీనిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
తానే గనుక సైన్యంలో ఉంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రాఖీని కాల్చిపారేస్తానంటూ ఓ నెటిజన్ ఆవేశం ప్రదర్శించాడు. దేశంలో కల్లోలానికి కారణమవుతూ, ఎంతోమందిని బలిగొంటున్న పాక్ కు మద్దతిస్తావా? అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.