ఇప్పుడిది చట్టబద్ధమేనట... త్రిషా పెళ్లి చేసుకుందామా?: చార్మీ తాజా ప్రపోజల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పుడిది చట్టబద్ధమేనట... త్రిషా పెళ్లి చేసుకుందామా?: చార్మీ తాజా ప్రపోజల్

  • ప్రపోజల్ ను ఎప్పుడు ఓకే చేస్తావా అంటూ వెయిట్ చేస్తున్నా
  • నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా
  • త్రిషకు వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పిన చార్మీ
దక్షిణాది స్లిమ్ బ్యూటీ త్రిష, టాలీవుడ్ ముద్దుగుమ్మ చార్మీ కౌర్ ల మధ్య మంచి స్నేహం ఉంది. త్రిష పుట్టినరోజు సందర్భంగా చార్మీ చేసిన ట్వీట్ ఎంతో సరదాగా ఉంది. "బేబీ ఐ లవ్యూ. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రపోజల్ ను ఎప్పుడు అంగీకరిస్తావా అని ఎదురుచూస్తున్నా. మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడిది చట్టబద్ధమేనట!" అంటూ కవ్వించేలా ట్వీట్ చేసింది.

గతంలోనూ చార్మీ, త్రిష మధ్య ఇలాంటి ట్వీటే ఒకటి విపరీతమైన సందడి చేసింది. అప్పుడు కూడా చార్మీ పెళ్లి ప్రపోజల్ తీసుకురాగా, త్రిష ఓకే చెప్పింది. మరి ఈసారి ప్రతిపాదనకు ఏమంటుందో చూడాలి!

త్రిష థర్టీ ప్లస్ ఏజ్ లో కూడా దక్షిణాది సినిమాల్లో రాణిస్తుండగా, చార్మీ కౌర్ మాత్రం థర్టీ లోపే నటనకు గుడ్ బై చెప్పి సినిమా ప్రొడక్షన్ రంగంవైపు మళ్లింది. పూరీ జగన్నాథ్ భాగస్వామ్యంలో పూరీ కనెక్ట్ సంస్థలో ఆమె ఎగ్జిక్యూటివ్ గా అనేక సినిమాల నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. త్రిష, చార్మీల మధ్య స్నేహం పౌర్ణమి చిత్రంలో కలిసి నటించినప్పటి నుంచి విడదీయరానిదిగా మారింది.
Tollywood
Trisha
Charmi

More Telugu News