లలితా జ్యువెలరీ దుకాణాల్లో ఏకకాలంలో అధికారుల తనిఖీలు
- సాధారణ తనిఖీల్లో భాగంగానే సోదాలు
- పరీక్షల కోసం కొంత బంగారం స్వాధీనం
- పలు అంశాలపై ఆరా తీసిన అధికారులు
సాధారణ తనిఖీల్లో భాగంగానే సోదాలు నిర్వహించినట్టు అధికారులు చెబుతున్నారు. షోరూమ్‌ల్లోని కొంత బంగారాన్ని పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నారు. తూనికలు, కొలతల శాఖ కమిషనర్ దామోదర్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీలలో బంగారం తూకం, నాణ్యత, ప్రైజ్‌మనీ చిట్స్ పలు అంశాలపై అధికారులు ఆరా తీశారు.