నా బెయిల్ పొడిగించకపోతే చికిత్సకు ఆటంకం కలుగుతుంది.. దయ చూపండి!: సుప్రీంకోర్టుకు నవాజ్ షరీఫ్ అభ్యర్ధన

షార్ట్స్‌లో చూడండి
ఆరు వారాల తన బెయిల్ ను మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతూ పాకిస్థాన్ సుప్రీంకోర్టులో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పిటిషన్ దాఖలు చేశారు. తన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ పొడిగించాలని కోర్టుకు విన్నవించారు. బెయిల్ పొడిగించకపోతే చికిత్సకు ఆటంకం కలుగుతుందని, తద్వారా క్షమించరాని నష్టం జరుగుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. యూకేలో చికిత్స అందించిన వైద్యుల చేత ట్రీట్ మెంట్ ఇప్పిస్తేనే మెరుగైన ఫలితం ఉంటుందని తెలిపారు.

సుప్రీంకోర్టులో షరీఫ్ తరపు న్యాయవాది వాదిస్తూ, తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో పాటు పలు సమస్యలతో ఆయన బాధపడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో షరీఫ్ బెయిల్ ను పొడిగించాలని కోరారు. షరీఫ్ కు మంజూరు చేసిన షరతులతో కూడిన బెయిల్ మే 7వ తేదీతో ముగుస్తుంది.
Go Back to Shorts
nawaz sharif
bail
pakistan

More Telugu News