Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  ప్రతి సినిమాకీ తాను భయపడుతూనే ఉంటానని అంటోంది కథానాయిక సమంత. 'నాకు మామూలుగానే డౌట్లు ఎక్కువ. అలాగే నేను చేసే సినిమాల గురించి కూడా డౌట్లు వస్తుంటాయి. చేస్తున్న సినిమా హిట్టవుతుందా? లేదా? అనే భయపడుతుంటాను. అయితే, విచిత్రంగా నేను బాగా భయపడే సినిమా బాగా ఆడుతుంది' అంటూ నవ్వేసింది సమంత.
*  లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన 'కాంచన 3' ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన నేపథ్యంలో 'కాంచన 4'కి కూడా సన్నాహాలు మొదలయ్యాయి. దీని గురించి లారెన్స్ చెబుతూ, 'మా ఇంట్లో వాళ్లు, అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు అంతా మరో సీక్వెల్ కూడా చేయమని అడుగుతున్నారు. నేను కూడా అదే పనిలో వున్నా. ఈ సీక్వెల్ కి మంచి పాయింట్ కోసం ఆలోచిస్తున్నాను' అని చెప్పాడు.
*  తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఆమధ్య వచ్చిన 'జైసింహా' చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. దీంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లోనూ మరో చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత సి.కల్యాణ్ సన్నాహాలు చేస్తున్నారు. జూలై నెల నుంచి దీని షూటింగ్ మొదలవుతుందని సమాచారం. 
Go Back to Shorts
Samantha
Lawrence
Balakrishna
Kalyan

More Telugu News