మరోసారి వాయిదాపడిన 'అర్జున్ సురవరం'
- నిఖిల్ నుంచి 'అర్జున్ సురవరం'
- తమిళ 'కణితన్'కి రీమేక్
- త్వరలో కొత్త విడుదల తేదీ
మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఆ రోజున థియేటర్స్ కి ఈ సినిమా రావడం లేదనేది తాజా సమాచారం. ఈ నెల 26వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో 'అవెంజర్స్ ' భారీస్థాయిలో విడుదల కానుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపై ఉండటం వలన, ఆశించినస్థాయిలో థియేటర్స్ లభించకపోవడం వలన 'అర్జున్ సురవరం' విడుదలను మరోసారి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.