KCR: హీరో నాగార్జున ఆక్రమించిన భూముల కేసు సంగతి ఏం చేశావ్?: కేసీఆర్ కు విజయశాంతి ప్రశ్న

షార్ట్స్‌లో చూడండి
రెవెన్యూ శాఖ ప్రక్షాళన పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నానాయాగీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి విమర్శించారు. రెవెన్యూ శాఖలో ఇప్పుడే అవినీతి జరిగిందా? అని ఆమె ప్రశ్నించారు. తప్పు చేసినవారిని బెదిరించడం, వారు లొంగిపోతే తెరవెనుక లాలూచీ పడటం కేసీఆర్ కు మామూలేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయశాంతి మాట్లాడారు.

గతంలో నయీం వివాదం, హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు విచారణ, మియాపూర్ భూములు, హీరో నాగార్జున ఆక్రమించిన భూముల కేసు సంగతి ఎంతవరకూ వచ్చాయని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంశం కూడా కొండను తవ్వి ఎలుకను పట్టే చందంగా మారుతుందని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
KCR
nagarjuna
TRS
vijashanti
Congress
Telangana

More Telugu News