ఫ్యామిలీతో విదేశాలకి వెళుతోన్న రవితేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్యామిలీతో విదేశాలకి వెళుతోన్న రవితేజ

  • రవితేజను పలకరిస్తోన్న పరాజయాలు
  •  షూటింగు దశలో 'డిస్కోరాజా'
  • త్వరలోనే లైన్లోకి రెండు ప్రాజెక్టులు
'రాజా ది గ్రేట్' విజయం రవితేజకి ఊరట కలిగించినప్పటికీ, ఆ తరువాత వచ్చిన సినిమాలు ఆయనకి పూర్తి నిరాశను కలిగించాయి. కొత్తగా ఉన్నాయని ఆయన అనుకున్న కథలు .. విభిన్నంగా వున్నాయనుకుని ఆయన చేసిన పాత్రలేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దాంతో ఆయన కథల విషయంలో మరింత శ్రద్ధ పెట్టాడు. అంతకుముందు ఓకే చేద్దామనుకున్న ప్రాజెక్టులను కూడా రద్దు చేసుకున్నాడు.

తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే పూర్తి నమ్మకం కలిగిన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగానే ఇప్పుడు ఆయన 'డిస్కో రాజా' సినిమా మాత్రమే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. అయితే ఎండలు విపరీతంగా ఉండటంతో, కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న రవితేజ, ఫ్యామిలీతో విదేశాలకి బయలుదేరుతున్నాడు. వచ్చేనెలలో ఆయన వచ్చాకనే షూటింగు మొదలవుతుందట. అక్కడి నుంచి వచ్చాకనే మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టనున్నాడని అంటున్నారు. 
raviteja

More Telugu News