టీసీఎస్ ఉద్యోగిని లావణ్య హత్యకేసులో ప్రియుడే కాలయముడు!
- సూట్ కేసులో కుక్కిన స్థితిలో లావణ్య మృతదేహం
- మస్కట్ తీసుకెళ్తానంటూ, శంషాబాద్ లో హత్య
- సునీల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ నెల 4న లావణ్యను తీసుకుని శంషాబాద్ కు చేరుకున్న సునీల్, వాష్ రూమ్ కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి, విమానం వెళ్లిపోయాక వచ్చి, తదుపరి విమానంలో వెళదామని చెప్పి, శంషాబాద్ లోని ఓ లాడ్జిలో బస చేశారు. 5వ తేదీన ఉదయం పెళ్లి విషయంలో వాదన జరగడంతో, తీవ్ర ఆగ్రహంతో లావణ్య గొంతు నులిమాడు. దీంతో ఆమె మరణించగా, సూట్ కేసులోని దుస్తులు తీసేసి, మృతదేహాన్ని అందులో కుక్కాడు. అదే రోజు రాత్రి సూట్ కేసును సూరారం కాలువలో పడేశాడు.
తమ బిడ్డ మస్కట్ వెళ్లి ఆరు రోజులైనా తిరిగి రాకపోవడంతో లావణ్య తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు తొలి అనుమానం సునీల్ పైనే వచ్చింది. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా, మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది.