Nara Lokesh: నా ఓటమికి వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది: నారా లోకేశ్
ఏపీ మంత్రి నారా లోకేశ్ వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో తనను ఓడించడానికి వైసీపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. తన ఓటమినే లక్ష్యంగా చేసుకున్న వైసీపీ అందుకోసం అద్దెకు తారలను రంగంలోకి దింపుతోందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2024 నాటికి రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని అన్నారు. వెనుకబడిన వర్గాల కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు, మంగళగిరికి చెందిన స్థానిక నేత తాడిబోయిన ఉమాయాదవ్ తో కలసి ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.