Telangana: సీఈసీ స్వతంత్ర సంస్థలా వ్యవహరించట్లేదు..చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రచారం చేస్తా: వీహెచ్

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ఎన్నికల సంఘం తీరును టీ-కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తప్పుబట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థలా వ్యవహరించడం లేదని, ఏపీలో ఈసీ పరిధిలో లేని నిఘా అధికారిని బదిలీ చేయడం అన్యాయమని అన్నారు. ఏపీలో జగన్ కు, తెలంగాణలో కేసీఆర్ కు లబ్ధి చేకూరేలా ఎన్నికల సంఘం పనిచేస్తున్నట్టు ఉందని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్రాన్ని జగన్ దోచుకున్నారని ఆరోపణలు చేశారు.
Go Back to Shorts
Telangana
Andhra Pradesh
Telugudesam
Congress
vh

More Telugu News