రాజమౌళి సినిమా సెట్లోకి అడుగుపెట్టబోతోన్న అందాల భామలు

  • షూటింగు దశలో రాజమౌళి మూవీ
  • తదుపరి షెడ్యూల్ నార్త్ ఇండియాలో 
  • 2020 జూలై 30వ తేదీన విడుదల
ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం రాజమౌళి సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ .. చరణ్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను నార్త్ ఇండియాలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కథానాయికలు కూడా పాల్గొననున్నారని అంటున్నారు.

ఈ సినిమాలో చరణ్ జోడీగా ఆలియా భట్ ను .. ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా నార్త్ ఇండియాలో ప్లాన్ చేసిన షూటింగులో జాయిన్ కానున్నారని చెబుతున్నారు. ఇక ముఖ్యమైన పాత్రల కోసం అజయ్ దేవగణ్ ను .. సముద్రఖనిని తీసుకోగా .. ఇతర పాత్రల కోసం మరికొంతమంది స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. 2020 జూలై 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
ntr
charan
alia bhatt
daisy

More Telugu News