వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మరొకరి అరెస్ట్.. కడపకు తరలింపు
- పోలీసుల అదుపులో దిద్దెకుంట శేఖర్
- విచారణ అనంతరం కడపకు తరలింపు
- దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు
ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. వివేకా డ్రైవర్ నుంచి ఆయనకు సన్నిహితంగా ఉండే అందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు అందరినీ విచారిస్తూ స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారు. మరోవైపు వైఎస్ కుటుంబ సభ్యులను కూడా పిలిపించి వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది.