aadi saikumar: ఆది సాయికుమార్ కొత్త సినిమా లాంచ్

షార్ట్స్‌లో చూడండి
కొంతకాలంగా ఆది సాయికుమార్ కి సరైన కథలు రావడం లేదు .. సరైన పాత్రలు పడటం లేదు. దాంతో యువ కథానాయకుల రేస్ లో ఆయన వెనకబడిపోతున్నాడు. ఈ నేపథ్యంలో కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వుంటూ, తనకి బాగా నచ్చిన కథలకి మాత్రమే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఆలా ఆయన ఒక ద్విభాషా చిత్రానికి ఓకే చెప్పేశాడు.

కార్తీక్ విఘ్నేశ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో రూపొందనుంది. 'వేదిక' కథానాయికగా నటించనున్న ఈ సినిమాను ఈ రోజునే లాంచ్ చేశారు. కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ నెల 25వ తేదీ నుంచి 'తలకోన'లో రెగ్యులర్ షూటింగును జరుపుకోనుంది. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Go Back to Shorts
aadi saikumar
vedika

More Telugu News