మా ఊరికి వెళ్లిపోతున్నా: ఓడిపోయిన బాధలో శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు!
- నరేష్ చేతిలో ఓడిపోయిన శివాజీరాజా
- నిబంధనలు పాటించని ప్రత్యర్థి ప్యానల్
- ఇష్టం లేకుండానే మీడియా ముందుకు వచ్చా
ఎంతోమంది తనను తిరిగి నిలబడాలని కోరితేనే పోటీ చేశానని, తనను ఓడించారని, ఇక తన భార్యతో కలిసి ఊరికి వెళ్లిపోతానని అన్నారు. ఎవరైనా ఏడిస్తే తనకు ఇష్టం ఉండదని, కానీ, శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి వారు తన కోసం పడ్డ కష్టం చూసి కన్నీరు ఆగడం లేదని అన్నారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, ఇష్టం లేకుండానే మీడియా ముందుకు వచ్చానని అన్నారు. ప్రత్యర్థి ప్యానల్ ఎన్నో విమర్శలు చేశారని, వాటిని ఖండించకుంటే, అవే నిజమని భావిస్తారేమోనన్న భయంతోనే మీడియా సమావేశం పెట్టానని అన్నారు. తప్పు చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.