India: యూత్ లో కొత్త క్రేజ్... అభినందన్ మీసకట్టు!

షార్ట్స్‌లో చూడండి
అభినందన్ వర్ధమాన్..! కొన్ని రోజుల క్రితం వరకు ఈ పేరుతో ఓ వ్యక్తి ఉన్నాడని చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడా పేరు యావత్ దేశంలో మార్మోగిపోతోంది. తన విమానం పాతతరానికి చెందినదైనా ఎంతో ఆధునిక వెర్షన్ విమానంతో పోటీపడి దాన్ని కుప్పకూల్చిన ఘనత సొంతం చేసుకున్నాడు వింగ్ కమాండర్ అభినందన్. ఈ క్రమంలో పాకిస్థాన్ సైన్యానికి చిక్కినా ఎక్కడా వెరవకుండా, ఒక్క రహస్యం కూడా జారకుండా వ్యవహరించడం ఈ వీర పైలట్ కే చెల్లింది. ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసి పాక్ భూభాగంపై దిగిన క్షణం నుంచి తిరిగి వాఘా బోర్డర్ పాయింట్ వద్ద భారత గడ్డపై కాలుమోపేవరకు అభినందన్ వ్యవహరించిన తీరు అతడికి హీరో ఇమేజ్ ను తెచ్చిపెట్టింది.

 అయితే, అభినందన్ ఇప్పుడు ఇంకో రకంగా కూడా యూత్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అభినందన్ మీసకట్టు ఎంతో విలక్షణంగా ఉంటుంది. హ్యాండిల్ బార్ స్టయిల్లో ఉండే అతని మీసాలను భారత యువత ఎంతగానో ఇష్టపడుతోంది. చాలామంది యువకులు తమకూ అభినందన్ స్టయిల్ మీసకట్టు డిజైన్ చేయాలంటూ హెయిర్ స్టయిలిస్ట్ లను కోరుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోనే కాదు మామూలు పట్టణాల్లో సైతం అభినందన్ తరహా మీసాల కోసం కుర్రవాళ్లు సెలూన్ల బాటపడుతున్నారు. అభినందన్ ముస్టాచ్ స్టయిల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేకంగా హ్యాష్ ట్యాగ్ కూడా దర్శనమిస్తోంది. 
Go Back to Shorts
India
Pakistan

More Telugu News