మన ప్రతిపక్ష నేతలు కొత్త బాలాకోట్ ను కనిపెట్టారు: ఎద్దేవా చేసిన అరుణ్ జైట్లీ
- జమ్మూకశ్మీర్లో ఉన్నది బాలా కోటే
- పాక్ లో ఉన్నది బాలాకోట్
- ఈ రెండింటికి తేడా తెలియనివాళ్లు మన విపక్ష నేతలు
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లో ఉండే బాలాకోట్ లో ఐఏఎఫ్ విమానాలు దాడిచేశాయని, అయితే దీనిపై పూర్తి సమాచారం రాకముందే బాలాకోటే అనే ప్రాంతం ఎల్వోసీకి సమీపంలో ఉందని, అక్కడ వాయుసేన దాడులు నిర్వహించిందని విపక్షాలు హడావుడి చేశాయని ఆరోపించారు. బాలా కోటే అనే ప్రాంతం భారత్ లోనే ఉందని, అది కూడా జమ్మూకశ్మీర్లోనే ఉందని వారు గుర్తించలేకపోయారని విమర్శించారు. అయినా మన విమానాలు మనదేశంలోని ప్రాంతంపైనే ఎందుకు దాడిచేస్తాయని జైట్లీ ప్రశ్నించారు. మన విపక్ష అతివాదులు కొత్తగా బాలాకోట్ ప్రాంతాన్ని కనిపెట్టారంటూ ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు.