ఐఏఎఫ్ పైలట్ అభినందన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ ను కొట్టివేసిన లాహోర్ హైకోర్టు!
- అభినందన్ ను విడుదల చేయొద్దంటూ పిటిషన్
- పిటిషన్ కు అసలు విచారణార్హత లేదన్న హైకోర్టు
- నేడు సాయంత్రం 4 గంటలకు అభినందన్ విడుదల
తాజాగా లాహోర్ హైకోర్టు అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను విచారించింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్ కు ఎలాంటి విచారణ అర్హత లేదని అభిప్రాయపడ్డ ధర్మాసనం దాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో అభినందన్ విడుదలపై కొనసాగుతున్న సందిగ్ధత వీడింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వాఘా-అట్టారి బోర్డర్ లో అభినందన్ ను పాక్ సైన్యం భారత్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.