బిలియన్ల మంది హృదయాల్లో ఆనందాన్ని నింపారు: అభినందన్ విడుదలపై సిద్ధూ ట్వీట్
- రేపు అభినందన్‌ను విడుదల చేస్తున్నామన్న పాక్
- ప్రతి గొప్ప పని దానికదే దారి వెతుక్కుంటుందన్న సిద్ధు
- ప్రేమించే వారందరికీ సంతోషాన్ని పంచిందని ట్వీట్
అభినందన్ విడుదలపై తాజాగా పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ప్రతి ఒక్క గొప్ప పని దానికదే దారి వెతుక్కుంటుంది. మీరు చేసిన మంచి ప్రకటన బిలియన్ల మంది ప్రజల హృదయాల్లో ఆనందాన్ని నింపింది. నాతో పాటు అభినందన్ తల్లిదండ్రులకు అలాగే ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరికీ చాలా సంతోషాన్ని పంచింది’’ అంటూ సిద్దూ ట్వీట్‌లో పేర్కొన్నారు.