surya: 'కాప్పాన్' యూనిట్ సభ్యులకు బిర్యాని వడ్డించిన సూర్య

షార్ట్స్‌లో చూడండి
తమిళనాట సూర్యకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. జయాపజయాల సంగతి అటుంచితే, అభిమానులతో ఎంతమాత్రం గ్యాప్ రాకుండా ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'కాప్పాన్' రూపొందుతోంది. సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్ లాల్ .. ఆర్య .. పూర్ణ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. భోజనాల సమయంలో సూర్య దగ్గరుండి మరీ యూనిట్ సభ్యులందరికీ బిర్యాని వడ్డిస్తున్నాడట. అంతపెద్ద  హీరో 'ఇంకొంచెం .. ఇంకొంచెం' అంటూ కొసరి కొసరి వడ్డిస్తుంటే, ఆయన ఆత్మీయతకు యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారట. సెట్లో ఉన్నవాళ్లందరినీ ఆయన తన సొంత మనుషుల్లా చూసుకుంటూ ఉండటంతో, వాళ్లంతా ఆనందంతో పొంగిపోతున్నారట. ఇక ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనేది ఆయన అభిమానుల మాటగా వినిపిస్తోంది.
Go Back to Shorts
surya
sayesha

More Telugu News