'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై తొలిసారి స్పందించిన చంద్రబాబు... టెలీ కాన్ఫరెన్స్ లో ప్రస్తావన!
- ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారు
- కుట్రదారులతో చేతులు కలిపిన దర్శకులు
- తిరస్కరించాలని ప్రజలకు చంద్రబాబు వినతి
ఎన్టీఆర్ జీవితం ఎందరికో స్ఫూర్తని, అందుకే 'మహానాయకుడు', 'కథానాయకుడు' చిత్రాలు ఆ స్ఫూర్తిని చాటి చెప్పేలా వస్తున్నాయని అన్నారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని చంద్రబాబు ప్రస్తావించడం ఇదే మొదటిసారి. వాస్తవాలను వక్రీకరించి సినిమాలు తీస్తే, ప్రజలు వాటిని చూడబోరని అన్నారు. వారికి గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే రానుందని హెచ్చరించారు. కాగా, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మార్చి తొలి వారంలో విడుదల కానుండగా, ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' రేపు రిలీజ్ అవుతోంది.