ఆఖరి వికెట్ కు 78 పరుగులు... సౌతాఫ్రికాపై శ్రీలంక సంచలన విజయం!
- శ్రీలంక ముందు 304 పరుగుల లక్ష్యం
- అన్నీ తానై పోరాడిన కుశాల్ పెరారా
- 153 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
9 వికెట్లు పడిపోయిన తరువాత వచ్చిన ఫెర్నాండోతో కలిసి ఆఖరి వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు పెరీరా. ఫెర్నాండోకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వకుండా 153 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కుశాల్ పెరీరా 86 పరుగుల వద్ద ఉన్న వేళ, ఫెర్నాండో క్రీజులోకి రాగా, అతను 6 పరుగులు చేసే సరికి పెరీరా 153 పరుగులకు చేరుకున్నాడంటే, అతని బ్యాటింగ్ తీరును అర్థం చేసుకోవచ్చు. మొత్తం 200 బంతులు ఎదుర్కొన్న పెరీరా 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 153 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పెరీరాకే లభించింది.