కొత్త టైటిల్ తో నిఖిల్ మూవీ ఫస్టులుక్
- 'ముద్ర' మూవీ టైటిల్ మార్పు
- కొత్త టైటిల్ గా 'అర్జున్ సురవరం'
- తమిళ 'కణిథన్' కి రీమేక్
న్యూస్ ఛానల్ కి సంబంధించిన ఓబీ వ్యాన్ రన్నింగ్ లో ఉండగా .. దాంట్లో నుంచి సీరియస్ గా ఫోటోలు తీస్తూ ఈ పోస్టర్లో నిఖిల్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్రపేరు 'అర్జున్ సురవరం' .. అదే టైటిల్ ను ఖరారు చేయడం విశేషం. మార్చి 29న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 2016లో తమిళంలో వచ్చిన 'కణిథన్' సినిమాకి ఇది రీమేక్. అధర్వ మురళి .. కేథరిన్ జంటగా నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. వైవిధ్యభరితమైన చిత్రం అనిపించుకుంది. మరి ఇక్కడ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.