chaitu: దిల్ రాజుకి నచ్చిన ఆ కథ చైతూ దగ్గరికి వెళ్లిందట

షార్ట్స్‌లో చూడండి
గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఒక సినిమాను నిర్మించాలని దిల్ రాజు అనుకున్నారు. ఓ శుభ ముహూర్తాన ఈ సినిమాను లాంచ్ కూడా చేశారు. రేపో మాపో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అనుకుంటూ ఉండగా, దిల్ రాజు తన మనసు మార్చుకున్నారు. ఆ ప్రాజెక్టును రద్దు చేసుకున్న ఆయన రాజ్ తరుణ్ తో ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు.

దాంతో గల్లా అశోక్ తో చేయాలనుకున్న కథనే రాజ్ తరుణ్ తో చేస్తున్నాడనే టాక్ వచ్చింది. కానీ అది గల్లా అశోక్ తో చేయాలనుకున్న కథ కాదని దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. గల్లా అశోక్ తో చేయాలనుకున్న కథను నాగచైతన్యతో చేయనున్నట్టుగా చెప్పారు. శశి దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 
Go Back to Shorts
chaitu
shashi

More Telugu News