మోదీ నాకు జూనియర్.. అయినా 10 సార్లు ‘సార్’ అని పిలిచాను!: సీఎం చంద్రబాబు
- ఏపీ ప్రయోజనాల కోసం తగ్గాను
- బిల్ క్లింటన్ ను కూడా సార్ అనలేదు
- బీజేపీతో పొత్తు లేకుంటే ఇంకో పది సీట్లు వచ్చేవి
కేవలం ఏపీ ప్రయోజనాల కోసమే మోదీని సార్ అని సంబోధించానని చంద్రబాబు తెలిపారు. 2014లో ఏపీకి న్యాయం చేస్తారన్న నమ్మకంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనీ, ఒకవేళ పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే మరో 10 అసెంబ్లీ స్థానాలను అధికంగా గెలిచేవాళ్లమని వ్యాఖ్యానించారు.