India: చేతులెత్తేసిన టీమిండియా... 20 ఓవర్లలో 55 పరుగులు, 8 వికెట్లు!

హామిల్టన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా చేతులెత్తేసింది. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ, జట్టును ఆదుకోవాల్సిన కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యాలు పేలవమైన షాట్లకు ప్రయత్నించి పెవీలియన్ చేరారు. వీరితో పాటు భువనేశ్వర్ కుమార్ 1 పరుగుకే అవుట్ కావడంతో ఇండియా స్కోరు 100 దాటడం కూడా గగనమనే పరిస్థితి కనిపిస్తోంది. బౌల్ట్ బౌలింగ్ లో కేదార్ చాదవ్ (1) అవుట్ కాగా, బౌల్ట్ బౌలింగ్ లోనే పాండ్యా 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవీలియన్ చేరాడు. ప్రస్తుతం కుల్ దీప్ యాదవ్ 2 పరుగులతో క్రీజులో ఉండగా, చాహాల్ వచ్చి చేరాడు. భారత స్కోరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 55 పరుగులు.
India
Newzeland
Cricket
Hamilton

More Telugu News