ఎన్నికలకు ముందు జగన్ ఘోర తప్పిదం: గంటా శ్రీనివాస్
- కేసీఆర్-జగన్ అవిభక్త కవలలు
- తలకిందులుగా తపస్సు చేసినా జగన్ సీఎం కాలేరు
- వచ్చే ఎన్నికల్లో జగన్‌కు పరాభవం తప్పదు
జగన్ తలకిందులుగా తపస్సు చేసినా టీడీపీని, చంద్రబాబును ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు. ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీని ఒక్క మాటైనా అనే దమ్ము జగన్ కు లేదని విమర్శించారు. ఇన్నాళ్ల తెరచాటు రాజకీయాలకు ఇప్పుడు తెరపడిందన్న గంటా.. రానున్న ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. సెల్ఫ్ గోల్ చేసుకోవడం అలవాటైన జగన్ ఈసారి బయటపడే అవకాశమే లేదని మంత్రి పేర్కొన్నారు.