బొత్స భార్య కారు ఢీకొని గాయపడిన చిన్నారి మృతి!
- మూడ్రోజుల క్రితం తామరాపల్లిలో ప్రమాదం
- చిన్నారిని రిమ్స్ కు తరలించిన తల్లిదండ్రులు
- జాతీయ రహదారిని దిగ్బంధించిన గ్రామస్తులు
చిన్నారి మృతికి నిరసనగా ప్రజలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నుంచి హామీ వచ్చేవరకూ వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు ఈరోడ్డుపై పికెటింగ్ ఏర్పాటు చేశారు. జలుమూరు ఎస్‌ఐ గోవిందరావు, నరసన్నపేట ఎస్‌ఐ నారా యణ స్వామి ఆధ్వర్యంలో గ్రామంలో పహారా నిర్వహిస్తున్నారు.