మోదీ అయ్యప్ప స్వామిని కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు!: టీడీపీ నేత సీతారామలక్ష్మి
- ప్రధాని ఏ రాష్ట్రాన్నీ పట్టించుకోవడం లేదు
- హడావుడిగా ఈబీసీ బిల్లును తెచ్చారు
- కాపుల రిజర్వేషన్ ను చంద్రబాబే పట్టించుకున్నారు
కాపుల రిజర్వేషన్ కూడా చాలాకాలంగా పెండింగ్ లో ఉందని సీతారామలక్ష్మి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు మినహా ఎవ్వరూ దీన్ని పట్టించుకోలేదన్నారు. కాపుల కోసం బడ్జెట్ లో సీఎం రూ.1000 కోట్లు కేటాయించారనీ, ఉపాధి కల్పన కోసం రుణాలు ఇస్తున్నారని గుర్తుచేశారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా హడావుడిగా లోక్ సభలో సభ్యులను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేవరకూ కేంద్రంపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.