కేటీఆర్ ని కలిసిన సంగీత దర్శకుడు కోటి

  • కేటీఆర్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన నేతలు
  • నేతలు, ప్రముఖులతో కిక్కిరిసిన  తెలంగాణ భవన్
  • కేటీఆర్ పై రాసిన పాట విడుదల చేసిన కోటి 
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ నేతలు, పలువురు  ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన్ని కలిసేందుకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో హైదాబాద్ లోని తెలంగాణ భవన్ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా కేటీఆర్ ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, గాయని బేబీ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ పై రామలింగం రాసిన పాటను కోటి విడుదల చేశారు.

అనంతరం, మీడియాతో కోటి మాట్లాడుతూ, మోస్ట్ సక్సెస్ ఫుల్ నేత కేటీఆర్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశానని అన్నారు. తమతో పాటు సింగర్ బేబీ కూడా కేటీఆర్ ని కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారని అన్నారు. ఈ పాటకు సంబంధించిన ఒక వాక్యాన్ని బేబీతో కేటీఆర్ పాడించారని, చాలా ఆనందపడ్డారని అన్నారు. కేటీఆర్ చేసిన విజయవంతమైన కార్యక్రమాల గురించి ఈ పాటను రాశారని, ఈ పాటను సింగర్ మనో పాడారని చెప్పారు.

అనంతరం, సింగర్ బేబీ మాట్లాడుతూ, కేటీఆర్ ని కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, కేటీఆర్ ని తప్పకుండా కలవాలని చెప్పి తనను తీసుకువచ్చింది కోటి అని చెప్పారు. తన జీవితంలో కొత్తమలుపు కోటి అని, మళ్లీ కలుస్తానని, తనతో మళ్లీ పాటలు పాడించుకుంటామని కేటీఆర్ తనకు చెప్పినట్లు బేబీ పేర్కొన్నారు.
Go Back to Shorts
KTR
music director
koti
Telangana bhavan

More Telugu News