అరంగేట్రంలోనే అదరగొడుతున్న మయాంక్ అగర్వాల్... తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ!
- మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో మూడో టెస్టు
- తొలి మ్యాచ్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్
- నమ్మకాన్ని నిలుపుకుంటూ హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్ లో ఓపెనింగ్ జోడీని మార్చిన సంగతి తెలిసిందే. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో విఫలమైన రాహుల్, మురళీ విజయ్ ల స్థానంలో హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ లను పంపారు. ప్రస్తుతం భారత జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు కాగా, మయాంక్ 53, పుజారా 19 పరుగులతో ఆడుతున్నారు.