15 బంతుల్లోనే చివరి నాలుగు వికెట్లూ... ఓడిపోయిన ఇండియా!
- 140 పరుగులకే ఆలౌట్ అయిన భారత్
- 146 పరుగుల తేడాతో ఆసీస్ విజయం
- సిరీస్ 1-1తో సమం
భారత్ రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ డక్కౌట్ కాగా, మురళీ విజయ్ 20, పుజారా 6, కోహ్లీ 17, రహానే 30, హనుమ విహారి 28, పంత్ 30, యాదవ్ 2 పరుగులు చేశారు. చివర్లో వచ్చిన ఇషాంత్ శర్మ, బుమ్రా డక్కౌట్ కాగా, మహమ్మద్ షమీకి ఒక్క బాల్ ను కూడా ఎదుర్కొనే అవకాశం దక్కలేదు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లియాన్ లకు 3 వికెట్ల చొప్పున దక్కగా, హాజెల్ వుడ్, కుమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు.