త్రిషా.. అప్పుడే 16 ఏళ్లు అయిపోయిందా?: రానా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రిషా.. అప్పుడే 16 ఏళ్లు అయిపోయిందా?: రానా

  • అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన త్రిష
  • మీ అభిమానం కంటే నాకు ఇంకేమీ వద్దు అన్న త్రిష
  • మరింత కాలం ఇలాగే ఉండాలన్న రానా
చెన్నై భామ త్రిష సినీ రంగంలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయింది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ అగ్రనాయికగానే కొనసాగుతూ, సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇన్నేళ్ల పాటు తనను అభిమానించిన అందరికీ ఈ సందర్భంగా త్రిష ధన్యవాదాలు తెలిపింది. తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ థ్యాంక్స్ అని చెప్పింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనతో పాటే ఉన్న అభిమానుల కంటే తనకు ఇంకా ఎక్కువ ఏం కావాలని ట్వీట్ చేసింది.

త్రిష ట్వీట్ కు హీరో రానా స్పందించాడు. 'ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 16 ఏళ్లు గడిచిపోయిందా? వావ్. వెల్ డన్. మరింత కాలం నీవు ఇలాగే కొనసాగాలి' అంటూ ట్వీట్ చేశాడు.
trisha
rana
tollywood

More Telugu News