అల్లు శిరీష్ కి హిట్ ఇవ్వడం కోసమే రంగంలోకి మారుతి
- హిట్ కోసం వెయిట్ చేస్తోన్న శిరీష్
- కొత్త కథని సిద్ధం చేస్తోన్న మారుతి
- త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'కొత్త జంట' వచ్చింది .. కానీ అది సరిగ్గా ఆడలేదు. అందువలన తమ కాంబినేషన్లో తప్పకుండా హిట్ పడాలనే పట్టుదలతో ఆయన వున్నాడని అంటున్నారు. కొంతకాలం క్రితం మారుతి తాను రాసుకున్న 'జాతిరత్నం' అనే కథను, శిరీష్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్పులు చేస్తున్నాడట. పూర్తి వినోదాత్మకంగా ఈ కథను మలుస్తున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం శిరీష్ చేస్తోన్న 'ఏబీసీడీ' విడుదలయ్యాక ఈ ప్రాజెక్టు గురించిన ఎనౌన్స్ మెంట్ వుంటుందనే టాక్ వినిపిస్తోంది.