నా ముఖంలో నవ్వు కనిపించకపోవడానికి అదే కారణం కావొచ్చు!: గౌతం గంభీర్
- జీవితంలో నాకేదీ అంత సునాయాసంగా లభించలేదు
- 2007 ప్రపంచ కప్ క్రికెట్ లో నాకు స్థానం దక్కలేదు
- చాలా అప్ సెట్ అయ్యా.. సీరియస్ గా మారిపోయా
తాను ఎందుకు నవ్వను? అనే విషయమై చాలా మంది ప్రశ్నించిన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వాలని, సరదాగా ఉండాలని భావిస్తారని, అయితే, జీవితంలో తనకు ఏదీ అంత సునాయాసంగా లభించలేదని, కష్టపడాల్సి రావడంతో అలా ఉండటం అలవాటైపోయిందని అన్నాడు.
అండర్ -12 స్థాయి నుంచి జాతీయ జట్టులోకి వచ్చే వరకు తాను చాలా కష్టపడ్డానని గుర్తు చేసుకున్నాడు. తాను ఎంత బాగా ఆడినా జట్టు నుంచి తప్పించిన రోజులు ఉన్నాయని, ప్రతిసారి జట్టులో స్థానం కోసం పోరాడాల్సి వచ్చేదని అన్నారు. 2007 ప్రపంచ కప్ క్రికెట్ లో తనకు స్థానం దక్కకపోవడంతో సీరియస్ గా మారిపోయానని, తాను మనస్ఫూర్తిగా నవ్వలేకపోవడానికి కారణం అదే కావచ్చని గౌతమ్ గంభీర్ అన్నాడు.