స్పష్టమైన ఆధిక్యం దిశగా టీఆర్ఎస్... 82 స్థానాల్లో లీడ్!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 119 స్థానాలకు కౌంటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు టీఆర్ఎస్ 84 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి 22 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో ముందున్నారు. మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ అదనంగా మరో 24 చోట్ల మెజారిటీ చూపుతుండటం గమనార్హం. యాకత్ పురాలో అనూహ్యంగా ఎంఐఎం వెనుకబడగా, బీజేపీ ముందంజలో నిలిచింది.
Go Back to Shorts
Telangana Election 2018
Telangana Assembly Election
Telangana Assembly Results

More Telugu News