నిమిషాల్లో మారిపోయిన ట్రెండ్... రేవంత్ రెడ్డి వెనుకంజ... మల్లు భట్టి విక్రమార్క కూడా!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతోంది. రౌండ్ రౌండ్ కూ ఫలితాలు తారుమారవుతున్నాయి. కొడంగల్ నుంచి ప్రజా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలబడిన రేవంత్ రెడ్డి తొలి రౌండ్ లో ఆధిక్యాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

అయితే, రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ఆయన సుమారు 600 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇదే సమయంలో ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా తమ సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కన్నా వెనుకంజలో ఉన్నారు. మధిరలో అత్యధికంగా 90 శాతానికి మించిన పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
TRS
Telangana Election 2018
Telangana Assembly Election
Telangana Assembly Results
Revanth Reddy

More Telugu News