varun thej: 'అంతరిక్షం' నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో తొలిసారిగా అంతరిక్షం నేపథ్యంలో దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఒక సినిమా చేస్తున్నాడు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేసే పనుల్లో టీమ్ వుంది. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను వదలనున్నట్టుగా వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన కథానాయికలుగా లావణ్య త్రిపాఠి .. అదితీ రావు కనిపించనున్నారు. సముద్రం నేపథ్యంలో 'ఘాజీ' తీసి మెప్పించిన సంకల్ప్ రెడ్డి, 'అంతరిక్షం'తో ప్రేక్షకులను మరోమారు ఆశ్చర్యచకితులను చేయనున్నాడని చెప్పుకుంటున్నారు. చాలా అరుదుగా మాత్రమే ఇటువంటి సినిమాల్లో చేసే ఛాన్స్ వస్తుంది. అందువలన ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు.   
Go Back to Shorts
varun thej
lavanya
adithi

More Telugu News