Chandrababu: రాజకీయాల్లో నేను బిజీ అయిపోతున్నా.. నవ్యాంధ్ర అభివృద్ధి బాధ్యత మీదే: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయాల్లో తాను తీరిక లేకుండా గడుపుతున్నానని, రాష్ట్ర అభివృద్ధిలో అధికారులు భాగస్వామ్యం కావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో మొదటి స్థానంలో ఉందని, అధికారులు అదే ఉత్సాహంతో పనిచేసి ఈ ఏడాది కూడా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని కోరారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు బాగా కష్టపడుతున్నారంటూ ముఖ్యమంత్రి ప్రశంసించారు. నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధిలో అధికారులందరూ పాలుపంచుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Politics
Amaravathi

More Telugu News