బ్యాటు వదిలి రాకెట్ పట్టిన ధోనీ... చిత్రాలు ఇవిగో!

  • హోమ్ టౌన్ రాంచీకి వచ్చిన ధోనీ
  • టెన్నిస్ రాకెట్ పట్టుకుని సందడి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ-20 సిరీస్ లో స్థానం కోల్పోయిన తరువాత, ఎంఎస్ ధోనీ టెన్నిస్ రాకెట్ పట్టుకుని కాసేపు సందడి చేశాడు. తన హోమ్ టౌన్ రాంచీకి వచ్చిన ఆయన, జేఎస్సీఏ (జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్) అధీనంలోని స్టేడియంకు వచ్చాడు. అక్కడ కాసేపు టెన్నిస్ ఆడాడు. ధోనీ వచ్చాడని తెలుసుకున్న క్షణాల్లో అభిమానులు అక్కడ భారీగా చేరారు. వారంతా తమ అభిమాన ప్లేయర్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కాగా, ధోనీ తన చిన్నతనంలో ఫుట్ బాల్ గోల్ కీపర్ గా వ్యవహరించేవాడన్న సంగతి తెలిసిందే. ధోనీ ఆటలకు ఎన్నడూ దూరం కాడని కామెంట్లు పెడుతున్నారు.



Go Back to Shorts
MS Dhoni
Ranchi
Jarkhand
Cricket
Tennis

More Telugu News