ఏపీకి సాటిలేదు.. నైపుణ్యాభివృద్ధిలో నంబర్ వన్
- నైపుణ్యాభివృద్ధిలో ఏపీ భేష్
- ప్రభుత్వ కృషి ప్రశంసనీయం
- ఇండియా ‘స్కిల్స్ రిపోర్టు-2019’లో వెల్లడి
ఉద్యోగానికి అర్హమైన నైపుణ్యాలు ఉన్న యువతను అత్యధికంగా సరఫరా చేసే రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది రెండోసారి. అయితే, అత్యధిక సంఖ్యలో నియామకాలు జరిగే మొదటి మూడు రాష్ట్రాల్లో మాత్రం ఏపీకి చోటు దక్కలేదు. ఈ విభాగంలో గతేడాది జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు ఈసారి మాత్రం చోటు లభించలేదు. ఇప్పుడా స్థానాన్ని మహారాష్ట్ర ఆక్రమించుకుంది. నైపుణ్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం, ఏపీఎస్‌ఎస్‌డీసీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని నివేదిక పేర్కొంది.